టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. యువ నటుడు సుధీర్ వర్మ (35) సోమవారం విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ‘కుందనపు బొమ్మ’, ‘సెకండ్ హ్యాండ్’, ‘షూట్ ఔట్ ఎట్ ఆలేరు’ వంటి చిత్రాల్లో నటించారు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఆయన ఇలా ఆత్మహత్యకు పాల్పడటం సహచర నటీనటులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వ్యక్తిగత సమస్యలతోనే సుధీర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సుధీర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.