Kajal Aggarwal | కుమారుడి కోసం సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో పంజాబీ సుందరి..
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణాది చిత్రసీమలో అగ్ర తారగా వెలుగొందుతున్న ఈ పంజాబీ సుందరి ఖాతాలో భారీ విజయాలున్నాయి.
Kajal Aggarwal | అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణాది చిత్రసీమలో అగ్ర తారగా వెలుగొందుతున్న ఈ పంజాబీ సుందరి ఖాతాలో భారీ విజయాలున్నాయి. 2007లో ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్ వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పటివరకు 55కు పైగా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇక సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనుందని చెబుతున్నారు.
తన కుమారుడి బాధ్యతలు చూసుకోవడం కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తున్నది. ‘ప్రస్తుతం అంగీకరించిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఇక విశ్రాంతి తీసుకోవచ్చు’ అంటూ ట్విట్టర్లో కాజల్ పెట్టిన పోస్ట్ ఆమె రిటైర్మెంట్ వదంతులకు మరింత బలం చేకూర్చుతున్నది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ‘ఇండియన్-2’ ‘భగవంత్ కేసరి’ చిత్రాల్లో నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించవొచ్చని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

