The Wild Robot | హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్(Universal Pictres) నుంచి ‘ది వైల్డ్ రోబోట్’ (The Wild Robot ) అంటూ మరో క్రేజీ యానిమేషన్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఇంగ్లీష్ రచయిత పీటర్ బ్రౌన్ (Peter Brown) యొక్క 2016 బెస్ట్ సెల్లింగ్ బుక్ ‘ది వైల్డ్ రోబోట్’ (The Wild Robot ) ఆధారంగా వస్తున్న ఈ సినిమాను యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. క్రిస్ సాండర్స్ (Chris Sanders) దర్శకత్వం వహిస్తున్నాడు. లుపిటా న్యోంగో, పెడ్రో పాస్కల్, కేథరీన్ ఓ’హారా, బిల్ నిఘీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. అనుకోకుండా ఒక ఐలాండ్‌లో కొట్టుకువచ్చిన ఒక రోబోట్ అక్కడ ఉన్న జంతువుల మధ్య ఎలా సర్వైవ్ అవుతుంది అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.