కన్నడ అగ్రహీరో కిచ్చా సుదీప్ కథానాయకుడిగా రూపొందనున్న చిత్రం ‘బిల్లా రంగా బాషా’. అనూప్ భండారి దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘విక్రాంత్ రోణ’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ‘హను-మాన్’ఫేం కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ఈ హైబడ్జెట్ చిత్రానికి నిర్మాతలు. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోను, టైటిల్‌కి సంబంధించిన అఫీషియల్ లోగోను మేకర్స్ విడుదల చేశారు. ఇది భవిష్యత్‌లో జరిగే కథ అని ఈ వీడియో చెబుతున్నది. క్రీ.శ.2209వ సంవత్సరాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ.. ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, తాజ్ మహల్ స్మాష్ అయినట్టు చూపిస్తూ, ఓ వ్యక్తి ప్రపంచాన్ని జయించినట్టు ప్రజెంట్ చేయడం ఈ వీడియోలో ఆసక్తికరంగా ఉంది. ‘విక్రాంత్ రోణ’ని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని, సుదీప్ అభిమానుల అంచనాలను అందుకునేలా సినిమా వుంటుందని దర్శకుడు అనూప్ భండారి చెబుతున్నారు. అతి త్వరలో ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ మొదలుకానుంది.