హీరోగా, నిర్మాతగా మంచి విజయాలతో దూసుకుపోతున్నారు మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. తాజాగా ఆయన సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఐయామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకుడు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. షూటింగ్ పూర్తయింది. ఇందులో దుల్కర్ సల్మాన్ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని, ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు మంచి స్పందన లభించిందని, దక్షిణ భారత దేశంలోని 100కిపైగా ప్రదేశాలలో షూటింగ్‌ను నిర్వహించామని మేకర్స్ తెలిపారు. ఆగస్ట్‌లో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, దర్శకత్వం: నహాస్ హిదాయత్.