Vijay Devarakonda | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా విజయ్ కెరీర్లోనే కాకుండా టాలీవుడ్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు తాను రూ. 5 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిపాడు విజయ్. విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో నడుస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు విజయ్. ఇందులో భాగంగా అర్జున్ రెడ్డి గురించి పంచుకున్నాడు.
‘అర్జున్‌రెడ్డి’ సినిమాకి నేను తీసుకున్న పారితోషికం రూ.5లక్షలు. అప్పటివరకు అంత పెద్ద అమౌంట్ నేను చూడలేదు. అయితే ఈ సినిమాకు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌కి నాకోసం చాలా మంది వచ్చారు. వారి కోసం ఏదైనా చేయాలని అనిపించింది. దీంతో నాకు వచ్చిన అవార్డును వేలం వేస్తే రూ.25 లక్షలు వచ్చాయి. వాటిని మంచి పనులకు ఉపయోగించాను అంటూ విజయ్ చెప్పుకోచ్చాడు.