రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ డేట్‌ను మార్చి 27గా ఎపుడో ఫిక్స్ చేశారు. అయితే.. ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌కి తగిన సమయం అవసరమట. అందుకే.. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పార్ట్‌ని ముగించేయాలని దర్శకుడు బుచ్చిబాబు సానా భావిస్తున్నారు. నేటి నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను షురూ చేశారు. ఓ ప్రముఖ స్టూడియోలో కొన్ని కీలక సన్నివేశాలు, అలాగే కోఠి అసుపత్రి పరిసరాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారట. ఈ షూట్ ముగించిన వెంటనే టీమ్ ఢిల్లీకి పయనం కానున్నట్టు తెలిసింది.
అక్కడ ఈ నెల 18 నుంచి దాదాపు నాలుగు రోజుల పాటు ఓ చిన్న షెడ్యూల్‌ని ప్లాన్ చేశారట. కథలోని కొన్ని రియలిస్టిక్ సన్నివేశాలను, మాంటేజ్ షాట్స్‌ని అక్కడ తీస్తారట. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా షూటింగ్ 90శాతం పూర్తయినట్టేనని చిత్రబృందం చెబుతున్నది. ఇక మిగిలేది మూడు ప్రధానమైన ఘట్టలేనట. వాటిలో ఒకటి ైక్లెమాక్స్ ఎపిసోడ్ కాగా, రెండోది ఫ్యాన్స్‌కి గూస్బంప్స్ తెప్పించే కుస్తీ సీక్వెన్స్ అట.
ఇక మూడోది ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్. ఈ మూడూ పూర్తయితే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టేనని మేకర్స్ చెబుతున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్వేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, నిర్మాతలు: వెంకటసతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా, నిర్మాణం: వృద్ధి సినిమాస్, సమర్పణ: మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్.