ప్రభాస్ ‘ది రాజాసాబ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతున్నది. దర్శకుడు మారుతి చిత్ర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ‘ది రాజాసాబ్’ని విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు మారుతి. కథానుగుణంగానే కాకుండా, ‘ది రాజాసాబ్’ ైక్లెమాక్స్ కూడా సీక్వెల్‌ని డిమాండ్ చేస్తుండటంతో సీక్వెల్ రాసేందుకు మారుతి నిర్ణయం తీసుకున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం.
అయితే.. ప్రస్తుతం ప్రభాస్‌కు ఉన్న కమిట్మెంట్లను బట్టి చూస్తే.. ఈ సీక్వెల్ మొదలవ్వడానికే కొన్నేళ్లు పడుతుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈ సీక్వెల్‌కి చెందిన ప్రకటన వచ్చే అవకాశం లేకపోలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా హారర్ కామెడీ థ్రిల్లర్‌లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్.థమన్