కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘అమిగోస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో అషికా రంగనాథ్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు రాజేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. టైటిల్ ప్రకటన సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నిన్ను పోలిన మరో వ్యక్తి ఎదురైతే చచ్చిపోతావు అని చెబుతుంటారు’ అనే క్యాప్షన్‌ను పోస్టర్లో పెట్టారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పాత్ర మూడు విభిన్న ఛాయలతో సాగుతుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : గిబ్రాన్, సినిమాటోగ్రఫీ : ఎస్ సౌందర్ రాజన్.