ఇప్పుడు తమిళనాట ఎక్కడ చూసినా అగ్ర కథానాయిక త్రిష పేరే వినిపిస్తున్నది. ఇటీవల ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారోత్సవ వేడుకలో ఈ భామ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి అనుబంధం గురించి మరింత జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఇకముందు తమిళ రాజకీయాల్లో త్రిష తెర వెనుక కీలక భూమిక పోషించనుందనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సూర్యతో కలిసి త్రిష నటించిన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రానికి తమిళనాడులో ప్రత్యేక షోకు అనుమతి ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సినిమాకుగాను ఐదు ఆటలకు అనుమతినిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో గత కొన్నేళ్లుగా ప్రత్యేక షోలకు ప్రభుత్వం రద్దు చేసింది. సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ‘కరుప్పు’ సినిమా స్పెషల్షోకు అనుమతి రావడం చెన్నై ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తన చిరకాల మిత్రురాలు త్రిష కోసం సీఎం విజయ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని అంటున్నారు. ఆర్జే బాలా జీ దర్శకత్వం వహించిన ‘కరుప్పు’ చిత్రం ఈ నెల 14 న తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.