నాని కథానాయకుడిగా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడిక్ చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. భారీ సెట్లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఇందులో విదేశీ స్టంట్ మాస్టర్స్ కూడా పాల్గొంటున్నారని, సినిమాకిది హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. తన వారి రక్షణ కోసం ఆధిపత్య వ్యవస్థపై ఓ సామాన్యుడి తిరుగుబాటు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.