The Nun II | హాలీవుడ్ హారర్ చిత్రాలంటే మనకు ముందుగా గుర్తోచ్చే బ్యానర్ వార్నర్ బ్రదర్స్ (Warner Brothers). ఈ బ్యానర్ నుంచి వచ్చిన లైట్స్ అవుట్(Lights Out), ఐటీ ఛాప్టర్ 1, 2 (IT chapter), ది కంజురింగ్ (The Conjuring), అన్నబేల్లె (Annabelle), ఈవిల్ డెడ్ రైస్ (Evil dead rise) చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక 2018లో ఈ బ్యానర్ నుంచి వచ్చిన ది నన్ (The Nun 2018) అనే చిత్రం ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసుకుంది.
సుమారు ఐదేండ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‘ది నన్ 2’(The Nun II) తెరకెక్కుతుంది. జేమ్స్ వాన్, పీటర్ సాఫ్రన్, జూడ్సన్ స్కాట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మైఖేల్ చేవ్స్ (Michael Chaves) దర్శకత్వంలో వస్తుంది. ఇక ఈ చిత్రంలో సిస్టర్ ఇరేనే అనే ముఖ్యపాత్రలో టైస్సా ఫార్మిగా (Taissa Farmiga) నటిస్తోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్లు ట్రైలర్లు ప్రేక్షకులు అలరించాయి, ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 8న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియాలో విడుదల తేదీకి సంబంధించి మరో అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు.

The Nun 2
ది నన్ 2 (The Nun II) సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 8న విడుదల కానుండగా.. దానికంటే ఒక రోజు ముందే (సెప్టెంబరు 7) ఇండియాలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు వార్నర్ బ్రదర్స్ ఇండియా (Warners Brother) సోషల్ మీడియాలో తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆరోజే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో ఏ చిత్రం ఏ తరహాలో మెప్పిస్తుందో చూడాలంటే సెప్టెంబరు వరకు వేచి చూడాల్సిందే.
The Greatest Evil of The Conjuring Universe is back with yet another spine-chilling experience.
Watch The Nun II in Cinemas on Thursday, September 7, in English, Hindi, Tamil & Telugu.
#WarnerBrosIndia #TheNun2 #Valak #Horror #TaissaFarmiga #MichaelChaves pic.twitter.com/UF3tlvWZ1q— Warner Bros. India (@WarnerBrosIndia) August 17, 2023