Meera Raj | దక్షిణాది సినీ పరిశ్రమలో మరో మెరుపు తీగ మెరవబోతోంది. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న నటి మీరా రాజ్ ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనలోనూ తనదైన ముద్ర వేస్తూ ‘రైజింగ్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం మీరా రాజ్ నటించిన ‘సన్ ఆఫ్’ (Son Of) చిత్రం ఇండస్ట్రీలో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే మీరా స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే, ఆమెలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం మరొకటి ఉంది. ఉత్తరాది నుంచి వచ్చినప్పటికీ, ఈ సినిమా కోసం మీరా స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. పక్కా ‘తెలుగమ్మాయి’లా ఆమె పలికిన ఉచ్చారణ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
లారెన్స్ ‘కాంచన 4’లో క్రేజీ ఛాన్స్!
మీరా రాజ్ కెరీర్లో మైలురాయిగా నిలిచే అవకాశం తలుపు తట్టింది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రాబోతున్న ప్రతిష్ఠాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘కాంచన 4’లో మీరాకు కీలక పాత్ర దక్కింది. పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, నోరా ఫతేహి వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించే లారెన్స్, మీరాలోని స్పార్క్ చూసి ఈ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ.. “నాపై నమ్మకం ఉంచి ఈ పాత్రను ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన సపోర్ట్ మర్చిపోలేను” అని మీరా ఎమోషనల్ అయ్యారు.
భాష ఏదైనా.. డెడికేషన్ మాత్రం పీక్స్!
నటన పట్ల మీరా రాజ్‌కు ఉన్న నిబద్ధత చూసి ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పిన ఈ బ్యూటీ, ఇప్పుడు ‘కాంచన 4’ కోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. కేవలం డైలాగులు నేర్చుకోవడమే కాకుండా, అక్కడి సంస్కృతి, మేనరిజమ్స్‌ను కూడా అవపోసన పడుతూ తన ప్రొఫెషనలిజం చాటుకుంటోంది.
స్టార్ హీరోయిన్ రేసులో..
అందం, అభినయం, క్రమశిక్షణ.. ఈ మూడు కలిస్తే మీరా రాజ్. చిన్న అవకాశాన్ని పెద్ద విజయంగా మార్చుకోవడంలో ఆమె చూపిస్తున్న పట్టుదల చూస్తుంటే, అతి త్వరలోనే సౌత్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్గా ఎదగడం ఖాయమనిపిస్తోంది.