అవార్డ్స్ది న్యూ ఇండియన్ టైమ్స్ విజువల్ సంస్థ గత ఏడేళ్లుగా మీడియాలోని వివిధ విభాగాలకు అవార్డులను అందిస్తున్నది. ఈ ఏడాది పురస్కారాలను ఆగస్ట్ 23న బెంగళూరులో ప్రదానం చేస్తామని ది న్యూ ఇండియన్ టైమ్స్ విజువల్ మీడియా సీఈఓ రఘుభట్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అవార్డుల కోసం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నామని, ప్రతీ మీడియా ఛానల్ దరఖాస్తులు అందజేయొచ్చని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఐఫా, సైమా వంటి అవార్డుల ఉన్నట్లే.. మీడియాకి కూడా అదే స్థాయిలో గుర్తింపునివ్వాలనే లక్ష్యంతో ఈ అవార్డులను ప్రారంభించామని మార్కెటింగ్ హెడ్ ఖుషీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు శుభలేఖ సుధాకర్, ఉత్తేజ్ పాల్గొన్నారు.