మెరిసేలే..మెరిసేలే..
హీరోయిన్ హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మై నేమ్ ఈజ్ శృతి’. మురళీ శర్మ, ఆడుకాలం నారాయణ్, జయప్రకాష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆర్గాన్ మాఫియా నేపథ్యంతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ రూపొందిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మెరిసేలే మెరిసేలే’ అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటను మార్క్ కె రాబిన్ స్వరకల్పనలో కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా..సత్యయామిని ఆలపించారు. నాయిక పాడుకునే ఆహ్లాదకర సోలో పాటగా ఈ గీతం ఆకట్టుకుంటున్నది.
ఈ సందర్భంగా నిర్మాత బురుగు రమ్య ప్రభాకర్ మాట్లాడుతూ…‘ఇప్పటివరకు మా సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తున్నది. తాజాగా రిలీజ్ చేసిన ‘మెరిసేలె మెరిసేలే’ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఆర్గాన్ మాఫియా నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఉత్కంఠను కలిగిస్తూ సాగుతుంది. ఇప్పటివరకు తెరపై రాని కొత్త కాన్సెప్ట్‌తో సినిమా నిర్మించాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

