నవీన్చంద్ర, స్వాతిరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి దర్శకుడు. యశ్వంత్ ములుకుట్ల నిర్మాత. అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఓ నా మధు’ అనే పాటను శనివారం విడుదల చేశారు. అచ్చు రాజమణి స్వరపరచిన ఈ పాటకు దర్శకుడు శ్రీకాంత్ నాగోతి సాహిత్యాన్ని అందించారు.
కార్తీక్, యామిని ఘంటసాల ఆలపించారు. ప్రేమలోని మధురమైన అనుభూతులకు అద్దంపడుతూ ఈ పాట సాగింది. ప్రతి ఒక్కరికి ప్రేమ జ్ఞాపకాలను గుర్తు తెచ్చే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. శ్రేయ నవేలి, హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ ధరావత్, సంగీతం: అచ్చు రాజమణి, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి.