The Marvels | మార్వెల్ మూవీస్ (Marvel Studios). ఈ బ్యానర్ నుంచి మూవీ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన బ్లాక్ పాంథర్(Black Panther), ది ఎవెంజర్స్ (The Avengers), స్పైడర్ మ్యాన్ (Spider Man), కెప్టెన్ అమెరికా (Captain America) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించాయి. అయితే ఈ ఏడాది మార్వెల్ స్టూడియోస్ నుంచి రానున్న తాజా చిత్రం ది మార్వెల్స్(The Marvels). ఈ చిత్రానికి హాలీవుడ్ దర్శకురాలు నియా డాకోస్టా (Nia DaCosta) దర్శకత్వం వహిస్తుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు సూపర్ ఉమెన్స్ కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీనితో పాటు ఐమాక్స్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో కెప్టెన్ మార్వెల్ ఫేమ్ బ్రీ లార్సన్, టెయోనా ప్యారిస్, ఇమాన్ వెల్లని, పార్క్ సియో-జూన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా భారత్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
A triple threat 💙❤️💜
Check out the exclusive @IMAX poster for #TheMarvels. In theaters November 10. pic.twitter.com/guO2yhXR29
— Marvel Studios (@MarvelStudios) September 12, 2023
The countdown has begun.
Experience #TheMarvels in @IMAX, only in theaters November 10. pic.twitter.com/CQ8auGQJyh
— Marvel Studios (@MarvelStudios) September 12, 2023
MARVEL STUDIOS UNVEILS A NEW LOOK AT “THE MARVELS” AND EXCLUSIVE IMAX®️ POSTER
The #NiaDaCosta directorial is all set to shine bright this Diwali in theatres in English, Hindi, Tamil and Telugu.@Marvel_India @brielarson @TeyonahParris #ImanVellani… pic.twitter.com/2iIXda8Oee
— Ramesh Bala (@rameshlaus) September 13, 2023