ఉమ్మడి కుటుంబంలో ఇల్లాలి కష్టాలను చూపించిన మలయాళ సినిమా ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’. ఈ సినిమాను అదే పేరుతో తమిళంలో రీమేక్ చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్నారు. ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. రోజంతా వండటం, తోమడం, కడగటం, ఉతకడమే…ఆమె స్వేచ్ఛ పెనిమిటింట బందీ. సవాలక్ష ఆంక్షలను, నిబంధనలను అప్పుడే పెళ్లయి అత్తగారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి ఎలా భరించింది అనేది సినిమాలో చూపించారు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.