రచిత మహాలక్ష్మీ, కమల్ కామురాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తల్లి మనసు’. వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలోనే విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమమూర్తి అయిన ఓ తల్లి తన జీవితగమనంలో ఎదుర్కొన్న సంఘటనలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. మధ్యతరగతి తల్లి సంఘర్షణకు అద్దం పడుతూ హృదయాన్ని కదిలిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. రఘుబాబు, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, సంగీతం: కోటి, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ).