KC Venugopal Fires At National Awards | వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి జాతీయ అవార్డులు ప్రకటించడంపై కేరళలో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభ్యంతరం తెలుపగా.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మద్దతుగా ప్రతిపక్షాలు కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రం కేరళ ప్రతిష్టను దెబ్బతీసి, మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలో భాగమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ వివాదంపై ఆలప్పుజ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈ చిత్రం చెత్తబుట్టలో పడేయాల్సిన సినిమా. ఇది ఒక కుళ్ళిపోయిన ఎజెండాను ప్రచారం చేస్తోందని వేణుగోపాల్ ఆరోపించారు. అందమైన కేరళ రాష్ట్రాన్ని ఈ చిత్రం అపఖ్యాతి పాలు చేసిందని ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడం అనేది బీజేపీ ప్రభుత్వం ద్వేషాన్ని ఎలా స్పాన్సర్ చేసి ప్రోత్సహిస్తుందో చూపడానికి ఒక చక్కటి ఉదాహరణ అని వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సొంత దేశ ప్రభుత్వం నుంచి లభించిన ఈ అవమానాన్ని కేరళ ఎన్నటికీ సహించదని.. ప్రేమతో, ఆదరణతో, సోదరభావంతో కలిపి జీవించే కేరళ ప్రజలు బీజేపీకి గట్టిగా గుణపాఠం చెబుతారని కేసీ రాసుకోచ్చాడు.
2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం భారత రాజకీయల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కేరళ రాష్ట్రంలో “లవ్ జిహాద్” (మత మార్పిడి) కేసులు విపరీతంగా ఉన్నాయని, మహిళలను ఐసిస్‌లో చేరడానికి ఇరాక్, సిరియా వంటి దేశాలకు పంపుతున్నారని ఈ చిత్రం పేర్కొంది. దీంతో ఈ చిత్రంపై అధికార ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలను గుప్పించాయి.
The Kerala Story movie deserves to be in the dustbin. It peddles a rotten agenda and maligns my beautiful state of Kerala.
This movie getting the national award is the most perfect example of how the BJP sponsors and promotes hate from the highest echelons of government.…
— K C Venugopal (@kcvenugopalmp) August 1, 2025