The Kerala Story | గతేడాది విడుదలైన వివాదాస్పద చిత్రాల్లో ‘ది కేరళ స్టోరీ’ ఒకటి. సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగానూ సంచలనం సృష్టించింది ఈ చిత్రం. 2023 మే 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చి 8 నెలలు అయిన ఇంకా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓటీటీ అప్డేట్ ఇచ్చారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘జీ5’ వేదికగా ఈ చిత్రం ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక హిందీతో పాటు, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రసారం కానుంది.
లవ్ జిహాద్ నేపథ్యంలో రూ.35 కేట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా రూ.244.8 కోట్ల మేర రాబట్టిన విషయం తెలిసిందే. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అదా శర్మతోపాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
The Kerala Story, which grossed over 300 crores at the worldwide box office, finally managed to get the OTT platform after 8 months.#TheKeralaStory pic.twitter.com/2JNDKc7WVg
— Sacnilk Entertainment (@SacnilkEntmt) February 6, 2024