అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘పుష్ప-2’ (ది రూల్) చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకేత్తిస్తున్నది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ‘హంట్ ఫర్ పుష్ప’ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఈ సినిమా తాలూకు అప్డేట్స్ గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించారని తెలిసింది. ఇందుకోసం దాదాపు 35 రోజుల సమయం తీసుకున్నారని అంటున్నారు. ఇందులో అల్లు అర్జున్ గెటప్ థియేటర్లో పూనకాలు తెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు. త్వరలో ‘పుష్ప-2’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.