Ratan Tata Documentary | భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇక లేరనే వార్త చాలా మంది సామాన్యులతో పాటు ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలను కలచివేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం రతన్ టాటా మరణించగా.. నేడు అధికార లాంచనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పించారు. వ్యాపారవేత్తగా, సామజిక కార్యకర్తగా ఆయన ఎంతో మంచిపేరు సంపాదించుకున్నారు. అయితే రతన్ టాటా మరణించడంతో ఆయనను సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తాజాగా రతన్ టాటాపై ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది అన్న విషయం ప్రస్తుతం బయటకు వచ్చింది. అవును రతన్ టాటాకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ ఎపిసోడ్‌ను నేషనల్ జియోగ్రాఫిక్ ఆఫ్ ఇండియా (NatGeoIndia) చేసింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఆఫ్ ఇండియా మెగా ఐకాన్స్(Mega Icons) సీజన్ 2లోని ఎపిసోడ్2లో రతన్ టాటా గెస్ట్‌గా హాజరై తన ప్రయాణానికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలిపారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఇది ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తెలుగుతో పాటు తమిళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రేక్షకులు వీక్షించవచ్చు. మరోవైపు ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్ అవార్డుకు కూడా నామినేట్ అయి ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు అందుకుంది.