The India Story | భారతదేశంలో జరిగిన కొన్ని నమ్మలేని సంచలన నిజాల ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ అండ్ హార్డ్ హిట్టింగ్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story). ‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, శ్రేయాస్ తల్పాడే కీలక పాత్రలో నటిస్తున్నాడు. సాగర్ బీ దేశ్‌పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీతో పాటు టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ చిత్రం 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక టీజర్ చూస్తుంటే.. సమాజంలో దాగి ఉన్న అత్యంత దిగ్భ్రాంతికరమైన నిజాలను, తెరవెనుక జరిగిన పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నామని చిత్ర యూనిట్ ఈ సందర్భంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక విలక్షణమైన కథాంశంతో, ప్రేక్షకులను ఆలోచింపజేసే సస్పెన్స్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.