ఈ ఫ్రాంచైజీలో 3, 4 సినిమాలు కూడా రాబోతున్నాయి. వచ్చే ‘డీమాంటీ కాలనీ 3’ బిగ్ స్పాన్ మూవీ అవుతుంది. ఎన్నో ట్విస్ట్‌లతో టర్న్‌లతో ఈ సినిమా ఉండబోతున్నది. ఇంకా కొత్తకొత్త కథలు, కేరక్టర్లు ‘డీమాంటీ కాలనీ 3’లో యాడ్ అవ్వబోతున్నాయి.’
అని హీరో అరుల్‌నిథి అన్నారు. ఆయన కథానాయకుడిగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను బి.సురేశ్‌రెడ్డి, బి.మానసరెడ్డి తెలుగులోకి అనువదించి, ఆగస్ట్ 23న గ్రాండ్కి విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని హీరో అరుల్‌నిథి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం విలేకరులతో ఆయన ముచ్చటించారు. ‘ తెలుగులో కూడా ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి కారణం నిర్మాతలే. వాళ్లు సినిమాను ప్రమోట్ చేసిన తీరు అద్బుతం. త్వరలో సక్సెస్‌మీట్‌ని నిర్వహించనున్నాం.’
అని అరుల్‌నిథి తెలిపారు. ఈ సినిమాలో శ్రీని, రఘు అనే రెండు పాత్రల్లో తాను కనిపిస్తానని, వీటిలో రఘు పాత్ర పెక్యులర్‌గా ైస్టెలిష్‌గా, కేర్లెస్గా ఉంటుందని, ద్విపాత్రాభినయం చేయడం ఎంత కష్టమో ఈ సినిమాతో తెలిసొచ్చిందని, అయితే థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక కష్టాన్ని మరిచిపోయానని అరుల్‌నిథి అన్నారు. ఇక నుంచి థ్రిల్లర్ చిత్రాలే కాక, వేరే జానర్ సినిమాలు కూడా చేయాలనుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.