GOAT | తమిళ అగ్రహీరో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). మీనాక్షి చౌదరి కథానాయిక. కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మాతలు. తెలుగులో మైత్రీమూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘జిగి జింతాకు చూపే ఒక స్పార్కు.. ఆ నాజూకు నడకే క్యాట్వాక్కూ..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, యువన్‌శంకర్‌రాజా స్వరపరిచి, వృష బాలుతో కలిసి ఆలపించారు. ఈ పాటలో విజయ్ డాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేస్తాయని, విజయ్, మీనాక్షి చౌదరి కెమిస్త్రీ ఈ పాటలో ఓ రేంజ్లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ నుని.