న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ నటుడు, గ్రాండ్‌ఫాదర్ స్టార్ జేమ్స్ కాన్ మరణించారు. హాలీవుడ్ మూవీలతో పాటు బ్రైన్స్ సాంగ్, లాస్‌వెగాస్ వంటి ప్రముఖ టీవీ షోల్లోనూ అలరించిన జేమ్స్ కాన్ (82) బుధవారం రాత్రి మరణించారని ఆయన మేనేజర్ మ్యాట్ డెల్పియానో వెల్లడించారు.
జేమ్స్ కాన్ మరణం పట్ల హాలీవుడ్ దిగ్గజాలు సంతాపం తెలిపారు. జిమ్మీ తన సోదరుడు, జీవితకాల స్నేహితుడని, ధీరోదాత్తుడిగా కనిపించే జేమ్స్ మన మధ్య లేరనే విషయం నమ్మలేకపోతున్నానని అల్ పసినో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
జేమ్స్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని, ఈ విషాద వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని రాబర్ట్ డినిరో ట్వీట్ చేశారు. జేమ్స్‌తో స్క్రీన్ పంచుకున్న ఆడం శాండ్లర్ జేమ్స్ తనను ఎంతో ఇష్టపడేవారని, జేమ్స్ సినిమాలు అద్భుతంగా ఉండేవని, ఆయన మరణం అందరినీ విషాదంలో ముంచెత్తిందని అన్నారు.