The Girlfriend Movie | యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావా సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. అయితే ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేస్తుంది ఈ భామ. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend Movie). ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాను నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త టీజర్‌ను వదిలింది. ఇందులో రష్మిక బాయ్ ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి నటించబోతున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.