The Game: You Never Play Alone | శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్(The Game: You Never Play Alone). ఈ సిరీస్కు రాజేష్ ఎం. సెల్వా దర్శకత్వం వహిస్తుండగా.. సంతోష్ ప్రతాప్, చాందిని, శ్యామ హరిణి, బాలా హసన్, సుభాష్ సెల్వం, వివియా సంత, ధీరజ్, మరియు హేమ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 2, 2025 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
ఈ సిరీస్ ఒక గేమ్ డెవలపర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన ఈ పాత్ర తనపై జరిగిన ఒక సామూహిక దాడి వెనుక ఉన్నవారిని కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు డిజిటల్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను, రహస్యాలను ఈ థ్రిల్లర్ సిరీస్ చూపిస్తుంది. ఈ సిరీస్ థ్రిల్లర్గా మాత్రమే కాకుండా, మనం నివసించే డిజిటల్ ప్రపంచం, రహస్యాలు, మరియు మారుతున్న సంబంధాలను కూడా ప్రతిబింబిస్తుంది.
Oru game developer oda life la hardest level idhuva thaan irukum. Watch The Game, out 2 October, only on Netflix.#TheGameOnNetflix@NetflixIndia @ApplauseSocial @nairsameer @SegalDeepak @CheruvalathP #AmalgaCreationsMedias @RajeshMSelva @ShraddhaSrinath @ActorSanthosh pic.twitter.com/hKFzPxFMIU
— Shraddha Srinath (@ShraddhaSrinath) September 4, 2025