అరవింద్‌కృష్ణ నటిస్తున్న సూపర్‌హీరో తరహా చిత్రం ‘ఏ మాస్టర్‌పీస్’. సుకు పూర్వాజ్ దర్శకుడు. శ్రీకాంత్ కండ్రాగుల నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘టైటిల్‌కు తగ్గట్టుగానే ఇది మాస్టర్‌పీస్ లాంటి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది.
ఈ చిత్రంలో అరవింద్‌కృష్ణ పాత్ర స్టన్నింగ్‌గా వుంటుంది. ఇప్పటి వరకు హాలీవుడ్లో వచ్చిన సూపర్హీరోస్కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం ఉంటుంది. పెద్దలతో పాటు పిల్లలకు కూడా నచ్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. అఘరెడ్డి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివరామ్ చరణ్.