Karthikeya | కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్ దర్శకుడు. నేహాశెట్టి కథానాయిక. యువరాజ్ సమర్పణలో రవీంద్రబెనర్జీ (బెన్నీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో రాబోతున్న డ్రామెడీ( డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది.
గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ఈ చిత్రం ఉంటుంది. ఓ కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు’ అన్నారు. అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్‌ప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.