Manoj Bajpayee | థియేటర్లో విడుదలైన తర్వాత ఓటీటీలోకి సినిమాలు రావడం సర్వసాధారణమే. అయితే తాజాగా ఓ సినిమా ఓటీటీలోకి విడుదలైన వారం రోజుల తర్వాత థియేటర్లోకి వచ్చింది. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా? అదే మనోజ్ బాజ్ పాయి నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై సినిమా. గత నెల 23న నేరుగా జీ-5లో స్ట్రీమింగ్ అయినా ఈ సినిమా ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. కోర్డు డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబైలోని పలు థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. ఇక ఇలా ఓటీటీలో విడుదలైన పది రోజులకు ఓ సినిమా థియేటర్లో రిలీజవడం ఇదే తొలిసారి. గతంలో తెలుగులో కలర్ ఫోటో కూడా ఇలానే విడుదలైంది. కానీ అది పబ్లిక్ డిమాండ్ వల్ల రెండేళ్ల తర్వాత థియేటర్ ఎక్సపీరియెన్స్ కోసం విడుదల చేశారు.
ఇక మనోజ్ బాజ్ పాయి లాయర్ పాత్రలో నటించిన ఈ సినిమాకు అపూర్వ సింగ్ కర్కీ దర్శకత్వం వహించాడు. దేవుడిగా కొలిచే ఒక బాబా తనను వేధించాడంటూ ఓ అమ్మాయి పోలీసులను ఆశ్రయిస్తుంది. అయితే అందరూ ఆ బాబా గొప్పవాడని భావించడంతో ఆ అమ్మాయి మాటలు ఎవరూ నమ్మరు. అంతేకాకుండా ఆమెకు వ్యతిరేకంగా మారుతారు. ఆ సమయంలో ఓ లాయర్ ఆ అమ్మాయి బాధను అర్థం చేసుకుని కేసును టేకప్ చేస్తాడు. అప్పుడే ఆ లాయర్ కు సంచలన విషయాలు తెలుస్తుంటాయి. ఆ బాబా మాయలో ఆ అమ్మాయిలాంటి వారు ఎందరో వేధింపులకు గురి అవుతున్నారని తెలుసుకుంటాడు. అలా కేసు ఐదేళ్ల పాటు నడుస్తూ ఉంటుంది. మరి చివరికి కేసు గెలుస్తుందా? ఆ బాబాకు శిక్ష పడుతుందా? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.