Karishma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లల పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. కరిష్మా కపూర్ పిల్లలు ఇద్దరూ తమ దివంగత తండ్రి సంజయ్ కపూర్ వీలునామాను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం జాబితా చేసింది. కరిష్మా పిల్లల సవతి తల్లి ప్రియా కపూర్, కియాన్, సమైరాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును అక్టోబర్ 9వ తేదీన విచారించనున్నది. ప్రియా కపూర్‌ను పిటిషన్‌పై సమాధానం చెప్పాలని జస్టిస్ జ్యోతి సింగ్ ఆదేశించారు. ప్రియాకు తెలిసిన అన్ని చరాస్తులు, స్థిరాస్తుల జాబితాను దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. కరిష్మా పిల్లలు దాఖలు చేసిన పిటిషన్లో సంజయ్ కపూర్ గానీ, అటు ప్రియా కపూర్ గానీ వీలునామా గురించి ప్రస్తావించలేదని ఆరోపించారు. సవతి తల్లి ప్రియా ఫోర్జరీ చేసి నకిలీ వీలునామా పత్రాన్ని సృష్టించారని పిటిషన్లో పేర్కొన్నారు.
వీలునామా నిజమైంది కానందునే దాని ప్రతిని తమకు అందించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తండ్రి మరణించేనాటికి ఆయన వ్యక్తిగత ఆస్తుల వివరాలేవీ తమకు తెలియవని తెలిపారు. తమ తండ్రి మరణించేనాటికి ఉన్న ఆస్తి మొత్తం వివరాలన్నారు. ఇదిలా ఉండగా.. సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ 12న లండన్‌లో గుండెపోటుతో మరణించారు. 2003లో కరిష్మా కపూర్‌ని సంజయ్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ 2016లో విడాకులు తీసుకొని విడిపోయారు. వీరికి కొడుకు కియాన్, కూతురు సమైరా ఉన్నారు. ఆ తర్వాత సంజయ్ ప్రియా సచ్‌దేవ్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే, కరిష్మా, ప్రియా సచ్‌దేవ్‌ని పెళ్లి చేసుకునే ముందే నందిని మహతానిని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి 1996 పెళ్లి చేసుకోగా.. 2000 సంవత్సరంలో విడిపోయారు. మరో వైపు సంజయ్ కపూర్ మృతి చెందలేదని.. హత్యకు గురయ్యారంటూ ఆయన తల్లి ఇటీవల రాణి కపూర్ ఇటీవల బ్రిటన్ అధికారుల లేఖ రాశారు. హత్య వెనుక కుట్ర, ఆర్థిక మోసాన్ని బయటపెట్టేందుకు విచారణ జరపాలని కోరారు.