The Delhi Files | ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈ కశ్మీర్ పండిట్ల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం అందుకోవడమే కాకుండా విమర్శల పాలు కూడా అయ్యింది. అయితే ఈ సినిమా అనంతరం వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ది వాక్సిన్ వార్. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్ అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం చాలా రోజుల తర్వాత మరో సినిమాను ప్రకటించాడు వివేక్.
ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ది దిల్లీ ఫైల్స్’. ‘ది బెంగాల్ ఛాప్టర్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మించిన టాలీవుడ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఆగష్టు 15న ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
AFTER ‘THE KASHMIR FILES’, VIVEK AGNIHOTRI – ABHISHEK AGARWAL ANNOUNCE ‘THE DELHI FILES’… RELEASE DATE LOCKED… 15 Aug 2025 [#IndependenceDay] is the release date of director #VivekRanjanAgnihotri‘s #TheDelhiFiles: #TheBengalChapter.
Produced by #AbhishekAgarwal and… pic.twitter.com/k6VyKxJtRN
— taran adarsh (@taran_adarsh) October 3, 2024
ఇదిలావుంటే ఈ సినిమాపై నెటిజన్లు ప్రాపగండా మూవీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎలక్షన్ ప్లాన్ అని కామెంట్లు చేస్తున్నాయి.