Chiranjeevi Rayalaseema Backdrop | రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో మెగాస్టార్ చిరంజీవి మూవీ అనగానే వెంటనే గుర్తోచ్చే చిత్రం ఇంద్ర(Indra). ఈ సినిమా చిరంజీవి కెరీర్లో గుర్తిండిపోయే చిత్రంగా నిలవడమే కాకుండా ఇండస్ట్రీ హిట్‌ను అందుకుంది. రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి ఇంద్రసేనరెడ్డి, శంకర్ నారాయణ్ అనే రెండు పవర్ఫుల్ పాత్రల్లో నటించి అలరించారు. చిన్నికృష్ణ ఈ సినిమాకు కథను అందించగా.. బి. గోపాల్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు 23 ఏండ్లు అవుతుంది. దీని తర్వాత చిరు మళ్లీ సీమకథను టచ్ చేయలేదు. మరోవైపు రాయలసీమ నేపథ్యంలో చిరంజీవి ఒక మాస్ సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాలో చిరు రాయలసీమ ప్రాంతంకి చెందినవాడిగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో రాయలసీమ యాసలో వచ్చే డైలాగ్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దీనికోసం చిరు రాయలసీమ యాసపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ జూన్ నెలలో పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. కాగా చిరు రాయలసీమ కథపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది.