Best Indian Movies | ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది హాలీవుడ్ రిపోర్టర్ (THR) ఇండియా, 21వ శతాబ్దంలో (2000 సంవత్సరం తర్వాత) విడుదలైన అత్యుత్తమ భారతీయ చిత్రాలపై ఒక ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. “THR India’s 25 in 25: The Best Indian Movies of the 21st Century” పేరుతో విడుదలైన ఈ ర్యాంకింగ్‌లో భారతీయ సినిమాకు కొత్త దిశానిర్దేశం చేసిన ఎన్నో ముఖ్యమైన చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. అయితే ఈ జాబితాలో ప్రధానంగా బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ తదితర భాషల చిత్రాలు ఉన్నాయి. ఇక తెలుగు నుంచి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రం ఈ జాబితాలో చోటు నిలుపుకుంది. అయితే ఈ 25 ఐకానిక్ చిత్రాలు ఏంటి అనేది చూసుకుంటే.
1. అలైపాయుథెయ్ Alaipayuthey (తెలుగులో సఖి) (2000)
దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఐకానిక్ చిత్రాలలో ఒకటిగా నిలవడమే కాకుండా అప్పటివరకు ఉన్న లవ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు కొత్త నిర్వచనంగా నిలిచింది.
2. అన్బే శివన్ Anbe Sivam (తెలుగులో సత్యం సుందరం) (2003)
తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్ చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. కమల్ హాసన్. ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2003లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇద్దరు అపరిచితులు ఒకరినోకరు కలుసుకున్న అనంతరం వారి లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం వచ్చింది.
3. అంగమలై డైరీస్ (తెలుగులో ఫలక్‌నుమా దాస్) 2017
Angamaly Diaries | మలయాళంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రాలలో అంగమలై డైరీస్ ఒకటిగా నిలిచింది. కేరళలోని యూత్‌తో పాటు అక్కడి జీవన విధానం ఆధారంగా చేసుకోని వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
4. ఆశ జోర్ మఝే Asha Joar Majhe (బెంగాలీ) 2014
అదిత్య విక్రమ్ సెంగుప్తా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బెంగాలీ భాషలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
5. చక్ దే! ఇండియా (Chak De! India) (2007)
షారుఖ్ ఖాన్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా, భారత మహిళా హాకీ టీమ్ నేపథ్యంలో రూపొందించబడింది. ఇది కేవలం క్రీడా చిత్రం మాత్రమే కాదు, లింగ వివక్ష, మతం, టీమ్ స్పిరిట్ వంటి అంశాలను అద్భుతంగా ఆవిష్కరించింది.
6. కోర్ట్ (Court) 2014
మరాఠీ నుంచి ఐకానిక్ చిత్రాలలో కోర్ట్ సినిమా ఒకటి. చైతన్య తమ్హానే దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ న్యాయ వ్యవస్థ లోపాలను ఎత్తిచూపడంలో విజయవంతం సాధించిందని చెప్పవచ్చు.
7.దిల్ చాహ్తా హై (Dil Chahta Hai) (2001)
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, 21వ శతాబ్దపు భారతీయ యూత్‌లో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. స్నేహం, ప్రేమ, కెరీర్ గురించి నేటి యువత ఆలోచనలను, వారి మధ్య బంధాలను వాస్తవికంగా చూపించి ఇది ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
8. దృశ్యం 1,2 Drishyam 1 & 2 (2013; 2021)
మలయాళ నటుడు మోహన్ లాల్ కెరీర్లో నిలిచిపోయే చిత్రాలలో దృశ్యం చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ రెండు చిత్రాలు ఐకానిక్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
9. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ (Gangs of Wasseypur) (2012)
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ డ్రామా, భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. దీని నిజాయితీతో కూడిన కథనం, వాస్తవిక చిత్రీకరణ మరియు బలమైన పాత్రలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి.
10. ఈగ (Eega) (2012)
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాటిక్ విజువల్ వండర్ చిత్రాలలో ఈగ ఒకటి. నాని, సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో కిచ్చ సుదీప్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రం ఐకానిక్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇంకా ఈవే కాకుండా
11. కుంబలంగి నైట్స్ (మలయాళం) 2019
12. లగాన్ (హిందీ) 2001
13. లక్ బై ఛాన్స్ (హిందీ) 2009
14. మహేషింటే ప్రతికారం (మలయాళం) 2016
15.మాన్సూన్ వెడ్డింగ్ (హిందీ) 2001
16. నగర్ కీర్తన్ (బెంగాలీ) 2019
17. ఓంకారా (హిందీ) 2006
18. పారియారుమ్ పెరుమాల్ (తమిళం) 2018
19. పీకు (హిందీ) 2015
20. సైరట్ (మరాఠీ) 2016
21. సర్పట్ట పరంబరై (తమిళం) 2021
22. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ (మలయాళం) 2021
23. ఉడాన్ (హిందీ) 2010
24. ఉలిదవరు కందంటే (కన్నడ) 2014
25. విసరణై (తమిళం) 2015 వెట్రిమారన్