The Bengal Files | వివేక్ అగ్నిహోత్రి కొత్త చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’. ఈ మూవీ ట్రైలర్ శనివారం విడుదలైంది. ట్రైలర్ మధ్యాహ్నం 12గంటలకు విడుదల కావాల్సి ఉండగా.. పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దాంతో ఒక్కసారిగా ఈవెంట్ గందరగోళం నెలకొంది. వివేక్ అగ్నిహోత్రి, ఆయన భార్య, నటి పల్లవి జోషి పోలీసుల తీరుపై అంతృప్తి వ్యక్తం చేశారు. తమ గొంతును అణచివేస్తున్నారని మండిపడ్డారు. వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ‘సినిమా ట్రైలర్లను సాధారణంగా థియేటర్లలో విడుదల చేస్తారు. మా సినిమా కూడా ఇలాగే ఉండాల్సి ఉంది. కానీ, నేను అమెరికా నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్లలో ఒకటి రాజకీయ ఒత్తిడి ఉన్నందున తాము రిలీజ్ చేయలేమని చెప్పిందని నాకు తెలిసింది.
VIDEO | As trailer launch of ‘The Bengal Files’ was stopped in Kolkata, filmmaker Vivek Agnihotri (@vivekagnihotri) says, “It has happened in front of you, camera captured, the trailer launch of CBFC approved movie was stopped, this is an anarchy, dictatorship… Police had come… pic.twitter.com/bALRD8ihIA
— Press Trust of India (@PTI_News) August 16, 2025
మా సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేస్తే రాజకీయ గందరగోళం ఏర్పడుతుందని చెప్పారు. తర్వాత తాము మరో మల్టీప్లెక్స్‌తో మాట్లాడాం. వారు కూడా ఇదే చెప్పారు. క్షమించండి సార్.. చాలా రాజకీయ ఒత్తిడి ఉంది. మేం చేయలేమని చెప్పారు. నాకు ముందే తెలిసి ఉంటే నటులు, తమ బృందంతో ఇక్కడకు ఎందుకు వస్తాం. ఎందుకు ఖర్చు చేస్తాం. బెంగాల్ ఆధారంగా సినిమా తీశాం కాబట్టి ట్రైలర్‌ను కూడా ఇక్కడే లాంచ్ చేయాలని భావించాం’ అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. సినిమా ట్రైలర్ థియేటర్‌కు బదులుగా హోటల్లోని బాంకెట్ హాల్లో విడుదల చేశామని.. తొలిసారి ఇలా జరుగుతోందన్నారు. తమ గొంతును అణిచివేసేందుకు ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నానన్నారు.
#WATCH | West Bengal | A ruckus erupted during the release of ‘The Bengal Files’ trailer in Kolkata today. Actor Pallavi Joshi alleges the trailer launch was not allowed.
Actor Pallavi Joshi says, ” I absolutely did not like the way my film was stopped. Is there freedom of… pic.twitter.com/nKC3ACIV7a
— ANI (@ANI) August 16, 2025
ప్రభుత్వం దేనికి భయపడుతోంది ఆయన ప్రశ్నించారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కారణం ఏంటని ఆయన నిలదీశారు. ఒక వైపు నాపై చాలా ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయన్నారు. అధికార పార్టీ సభ్యులు ఇలా చేస్తున్నారని.. ఏ సామాన్యుడు ఇలా చేయడం లేదన్నారు. తాము సినిమాను ప్రకటించిన సమయంలోనే.. కోల్‌కతా ముఖ్యమంత్రి బెంగాల్ ఫైల్స్‌ను ఇక్కడకు రానివ్వబోమని అన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం దేనికి భయపడుతోంది? ఈ సినిమాతో సమస్య ఏంటన్నారు.
ఇది నియంతృత్వం కాకపోతే ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ.. బెంగాల్లో శాంతిభద్రతలు కుప్పకూలాయని, అందుకే అందరూ ‘ది బెంగాల్ ఫైల్స్’కు మద్దతు ఇస్తున్నారని అన్నారు. కొంతమంది హోటల్లోని వేదిక వద్దకు వచ్చి అన్ని వైర్లను కట్ చేశారని తనకు తెలిసిందన్నారు. ఇది ఎవరి ఆదేశాల మేరకు జరుగుతుందో నాకు తెలియదు? దీని వెనుక ఎవరున్నారో మీకు తెలసునన్నారు. తేదీలు ఖరారైన అయిన తర్వాత థియేటర్ యజమానులు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను రద్దు చేయాలని అన్నారన్నారు. ప్రైవేట్ హోటల్లోనూ చివరి క్షణంలో హోటల్ యజమానులు ట్రైలర్‌ను ప్లే చేయకూడదంటూ తమకు సూచనలు అందాయన్నారు. భారతదేశంలో రెండు రాజ్యాంగాలు, బెంగాల్లో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తున్నట్లుగా అనిపిస్తోందని.. అందుకే ‘ది బెంగాల్ ఫైల్స్’ అవసరమన్నారు.