The Archies Movie | షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్ (Suhana khan), శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ (Kushi kapoor), అమితాబ్ మనువడు అగస్త్య నంద (Agastya Nanda) ప్రధాన పాత్రల్లో అరంగేట్రం చేస్తున్న చిత్రం ది ఆర్చీస్ (The Archies Movie). గల్లీ బాయ్ ఫేం బాలీవుడ్ స్టార్ దర్శకురాలు జోయా అక్తర్ (Zoya Akthar) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో నేరుగా విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
‘ది ఆర్చీస్’ మూవీ డిసెంబర్ 07న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ విడుదలకు ఇంకా 100 రోజులు ఉన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీనితో పాటు ఓ వీడియో కూడా జత చేశారు. ఇక ఈ సినిమాను 1964 ఇయర్లో జరిగిన కథగా తెరకెక్కించగా.. బాల్యం, టీనేజీలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది.
The Archies
Archie, Jug, Betty, Veronica & the rest of the gang are about to take the stage in India.
The Archies premieres in 🎶 100 days 🎶 pic.twitter.com/z8cp34ron7
— Netflix (@netflix) August 29, 2023
Hamari kahaani ka countdown shuru ho chuka hai 🙌
This is a daily reminder that The Archies arrive on December 7th.#100DaysToGo ✨ pic.twitter.com/xb5EhgHKbe— Netflix India (@NetflixIndia) August 29, 2023