Shankar| పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఇండియన్ 2 (Indian 2). కమల్‌హాసన్ (Kamal Haasan)- శంకర్ (Shankar) క్రేజీ కాంబోలో భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోంది. కమల్‌హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జులై 12న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే లాంఛ్ చేసిన ట్రైలర్‌కు మిక్స్డ్ టాక్ వస్తోంది.
కాగా ప్రమోషనల్ ఈవెంట్లో శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇండియన్ 2ను రెండు పార్టులుగా తెరకెక్కించడానికి కారణమేంటో చెప్పుకొచ్చాడు శంకర్. ఇండియన్ 1 (భారతీయుడు) కథ కేవలం ఒక రాష్ట్రం చుట్టూ తిరుగుతుంది. ఇండియన్ 2 కథ అన్ని రాష్ట్రాల చుట్టూ తిరుగుతుంది. అందువల్లే కథ సాధారణంగానే పెద్దగా ఉంటుంది. ముందుగా ఒక పార్టు మాత్రమే చేయాలనుకున్నాం. కానీ ఎడిటింగ్ రూంలో సీన్లను చూసిన తర్వాత ప్రతీ సన్నివేశం చాలా బాగా వచ్చింది.
కథ సారాంశం విషయంలో కాంప్రమైజ్ అవ్వాలనుకోవడం లేదు. అందువల్లే ఇండియన్ 2ను రెండు పార్టులుగా తెరకెక్కించామని చెప్పుకొచ్చాడు శంకర్. ఈ కామెంట్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగిపోతుంది. ఒకేసారి ఇండియన్ 2, ఇండియన్ 3 షూటింగ్స్ జరిపినట్టు ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుందని తెలిసిందే. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు శంకర్ కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి.
ఇండియన్ 2 నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ (AN INTRO) సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.