Tharun Bhascker | పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో డైరెక్టర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు తరుణ్ భాస్కర్ దాస్యం (Tharun Bhascker). ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ తాజాగా స్వీయదర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కీడా కోలా (Keedaa Cola). క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను నేడు లాంఛ్ చేశారు. ఫన్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్లో ఆసక్తికర విషయాన్ని అందరితో పంచుకున్నాడు తరుణ్ భాస్కర్.
అదేంటంటే విక్టరీ వెంకటేశ్ (Venkatesh)తో తరుణ్ భాస్కర్ సినిమా ఉండబోతుందని గతంలో వార్తలు వచ్చాయని తెలిసిందే. వెంకటేశ్ సినిమా నిలిచిపోయిందా..? అని ఓ రిపోర్టర్ అడిగాడు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందిస్తూ.. పుకార్లును కొట్టిపారేస్తూ.. వెంకీ సినిమా కోసం ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంచుకున్నా. అయితే ఇప్పటికీ క్లైమాక్స్ రెడీ చేయలేదు. సినిమా సెకండాఫ్‌పై పనిచేయాల్సి ఉంది. సినిమా సరిగ్గా రాకపోతే ఎలాంటి విమర్శలు వస్తాయో నాకు తెలుసు. పెద్ద అవుట్‌పుట్ బాగా లేకపోతే పెద్ద హీరో సినిమా హ్యాండిల్ చేసే సామర్థ్యం లేదని జనాలు అనుకుంటారు. ఇప్పుడు దానిపైనే ఫోకస్ పెట్టానంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్‌తో ఇక సెకండాఫ్ రెడీ అయితే త్వరలోనే వెంకీ-తరుణ్ భాస్కర్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని అర్థమవుతోంది.
వెంకటేశ్ ప్రస్తుతం హిట్ ఫేం శైలేష్ కొలను డైరెక్షన్లో సైంధవ్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ 2024 జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. కీడా కోలా చిత్రాన్ని వీజీ సైన్మా బ్యానర్ (VG Sainma banner)పై కే వివేక్ సుధాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం , రవీంద్ర విజయ్, హరికాంత్, రఘురామ్, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీడాకోలా నవంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.