Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ మొదటి వారం సక్సెస్ ఫుల్‌గా ముగిసింది. కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ కాగా, రెండో వారం ఆసక్తికరంగా ఆరంభమైంది. ఎనిమిదో రోజు ఎపిసోడ్లో హౌజ్‌లో ఫుడ్ చర్చలు, సింపతీ గేమ్, కామెడీ ఎంటర్టైన్మెంట్, నామినేషన్లతో హైలైట్‌గా నిలిచింది. మొదటి ఎలిమినేషన్ తరువాత హౌజ్‌లో ఫుడ్ అంశమే పెద్ద చర్చకు దారి తీసింది. ఎవరికెంత ఇవ్వాలి, ఫ్రూట్స్ పంపిణీ ఎలా ఉండాలి, దొంగతనం జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై కంటెస్టెంట్లు చర్చించారు. అదే సమయంలో ఎవరు కుక్ చేయాలి, కెప్టెన్‌కి అసిస్టెంట్లు ఎవరవ్వాలి అనే అంశం కూడా డిబేట్‌గా మారింది. ఈ సందర్భంలో హరిత హరీష్ మౌనం పాటిస్తూ ఒంటరిగా కనిపించాడు.
హరిత హరీష్ సైలెంట్‌గా ఉండటంపై బిగ్ బాస్ అతడిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిపించారు. తనపై క్యారెక్టర్ అస్సాసినేషన్ జరుగుతోందని, ముఖ్యంగా రెడ్ రోజెస్ విషయాన్ని తప్పుగా చూపిస్తున్నారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఫ్యామిలీపై దాని ప్రభావం ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికి బిగ్ బాస్ స్పందిస్తూ, ఆటలో ఇలాంటి ఆటుపోట్లు సహజమని, వాటిని ఎదుర్కోవడమే సక్సెస్ కీ అని ధైర్యం నింపారు. అలాగే హరీష్‌ని చూసుకోవాలని రాముకి బాధ్యత అప్పగించారు. మరోవైపు ఇమ్మాన్యుయెల్ తన కామెడీతో హౌజ్‌లో నవ్వులు పూయించాడు. రీతూ చౌదరీ, డీమాన్ పవన్ ప్రైవేట్‌గా భోజనం చేస్తుండగా, రీతూని మిస్ అవుతున్నానని, పవన్ మధ్యలోకి వచ్చాడని ఫన్నీగా కామెంట్ చేశాడు ఇమ్మూ. తర్వాత తనూజ తన నడుము గిల్లిందని చెప్పి కూడా హౌజ్‌ని నవ్వుల్లో ముంచేశాడు. ఇది ఆ రోజు ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచింది.
నామినేషన్ల సమయంలో కెప్టెన్ సంజన తప్ప మిగతావారంతా ఇద్దరిని నామినేట్ చేశారు. తనూజ మొదట హరీష్‌ని నామినేట్ చేసింది. గత వారం తన ప్రవర్తనపై ఆయన అవమానకరంగా మాట్లాడాడని, ఫుడ్ విషయంలో కూడా ఇబ్బంది కలిగించాడని ఆరోపించింది. ఇద్దరి మధ్య ఘర్షణాత్మక వాగ్వాదం చోటు చేసుకుంది. రెండో నామినేషన్‌గా ఫ్లోరా సైనీని ఎంచుకుని, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటుందని ప్రశ్నించింది. మర్యాద మనీష్.. భరణిని నామినేట్ చేస్తూ, గొడవలు పెట్టుకుంటున్నాడని, డబుల్ గేమ్ ఆడుతున్నాడని విమర్శించాడు. రీతూని నామినేట్ చేస్తూ రూల్స్ బ్రేక్ చేస్తుందని, పనులు సరిగ్గా చేయడం లేదని ఆరోపించాడు. రీతూ దీనిపై కౌంటర్ ఇచ్చింది.
శనివారం, ఆదివారం షోలో నాగార్జున వ్యాఖ్యలతో హరీష్ ఇమేజ్ దెబ్బతిందని, దాంతో ఆయన సింపతీ గేమ్ ఆడుతున్నట్టుగా ఇతర కంటెస్టెంట్లు అభిప్రాయపడ్డారు. మొత్తానికి రెండో వారం మొదటి ఎపిసోడ్ ఫుడ్ చర్చలు, హరీష్ భావోద్వేగాలు, ఇమ్మాన్యుయెల్ కామెడీ, నామినేషన్లలో ఘర్షణలతో ఆసక్తికరంగా సాగింది.