టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు నాగచైతన్య (Naga Chaitanya), రాశీఖన్నా (Raashi Khanna) నటిస్తోన్న చిత్రం థాంక్యూ (Thank You). విక్రమ్ కుమార్ (Vikram Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంపై క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే చిత్రయూనిట్ మేజర్ పార్టు చిత్రీకరణ పూర్తి చేసింది. త్వరలోనే 3 రోజుల షూటింగ్ కోసం రాజమండ్రికి వెళ్లనుంది. రాజమండ్రి షెడ్యూల్ తర్వాత ముఖ్యమైన ప్యాచ్ వర్క్ షెడ్యూల్ కోసం విక్రమ్ అండ్ చైతూ అండ్ టీం అందమైన మైసూర్ సిటీకి పయనం కానుందట.
ఈ షెడ్యూల్‌తో థాంక్ యూ మొత్తం షూటింగ్ జరుపుకుంది. మైసూర్ షెడ్యూల్ తర్వాత శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయనుంది టీం. ఈ చిత్రంలో అవికాగోర్, మాళవిక నాయర్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
రాశీఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. గోపీచంద్-మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ లో నటిస్తోంది. తమిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది. నాగచైతన్య ఇటీవలే విడుదలైన లవ్ స్టోరీ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Janhvi Kapoor Langa Voni | లంగావోణిలో జాన్వీకపూర్..దీపావళి లుక్ అదిరింది
Shyam Singha Roy | స్పెషల్ అట్రాక్షన్‌గా ‘శ్యామ్ సింగరాయ్’ భామల ఫస్ట్ లుక్
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి