Thank You | నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ 'థ్యాంక్యూ' (Thank You) సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్యకు 'మనం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ (Vikram Kumar K) ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)నటిస్తున్న కొత్త సినిమా ‘థ్యాంక్యూ’ (Thank You). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. నాగ చైతన్యకు ‘మనం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ (Vikram Kumar K) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాశీ ఖన్నా (Raashi Khanna), మాళవిక నాయర్, అవికాగోర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా, రెండు పాటలు ‘మారో..’, ‘ఏంటో ఏంటేంటో…’ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
టీజర్ తోపాటు రిలీజ్ చేసిన రెండు పాటలు హిట్ అవడంతో “థ్యాంక్యూ” సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాను జూలై 8న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం రిలీజ్ డేట్ ను జూలై 22 తేదీకి మార్చారు. అన్ని కమర్షియల్ హంగులతో ‘థ్యాంక్యూ’ సినిమా జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
లెజెండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. నాగ చైతన్య కెరీర్ లో ‘థ్యాంక్యూ’ ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుందని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది.
https://twitter.com/madurimadhu1/status/1540291856701202432
Read Also : Chinmayi Sripada | చిన్మయి ఇన్స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్..కారణమిదేనట..!
Read Also : Bachchan Saab Fan Anthem | చోర్ బజార్ సాంగ్‌కు అమితాబ్ రీట్వీట్..ట్రెండింగ్‌లో సాంగ్
Read Also : Tabu | ‘అతడి వల్లే సింగిల్‌గా ఉన్నా’ అంటున్న టబు..!
Read Also : Rudhrudu 1st Look | స్పీడు మీదున్న రాఘవా లారెన్స్..ఫుల్ యాక్షన్ మూడ్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

