Mohan Raja | తలైవాకు ధన్యవాదాలు.. రజినీకాంత్ ప్రశంసలపై గాడ్ ఫాదర్ డైరెక్టర్
దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన గాడ్ ఫాదర్ (Godfather) మూవీ బాక్సాఫీస్ వద్ద చిరు అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ..మంచి వసూళ్లు రాబడుతోంది. కాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించి ప్రశంసలు కురిపించారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటించిన చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్గా వచ్చింది. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చిరు అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ..మంచి వసూళ్లు రాబడుతోంది. కాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించి ప్రశంసలు కురిపించారు.
ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేశాడు డైరెక్టర్ మోహన్ రాజా. గాడ్ ఫాదర్ చిత్రాన్ని సూపర్ స్టార్ చూశారు. అద్బుతం..చాలా బాగుంది..చాలా ఆసక్తికరంగా ఉంది..తెలుగు వెర్షన్లో కొత్తగా చూపించిన తీరుకు సూపర్ స్టార్ కురిపించిన ప్రశంసల్లో కొన్ని..తలైవాకు ధన్యవాదాలు..సార్ నా జీవితంలో మరిచిపోలేని క్షణాలు..మాటల్లోనే చెప్పలేను.. అంటూ తన సంతోషాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నాడు.
ఈ చిత్రంలో పూరీ జగన్నాథ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో నటించాడు. నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ, తాన్య కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా గాడ్ ఫాదర్ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Superstar watched #Godfather 😇
Excellent!! very nice!! very interesting!!! are few of the remarks in his detailed appreciation on the adaptions made for the Telugu version.
Thank u so much Thalaiva @rajinikanth sir, one of the best moments of life.. means a lotttt 🙏 pic.twitter.com/AFdT7oOoBe— Mohan Raja (@jayam_mohanraja) October 10, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

