Chiyaan Vikram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్ (Thangalaan). ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ గింప్ల్స్ విడుదల చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ చూస్తే.. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఊరి చివర నివసిస్తూ ఉండే ప్రజలకు, ఆంగ్లేయులకు మధ్య యుద్ధ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ టీజర్లో విక్రమ్ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఒక వైపు కత్తి పట్టుకొని అందరిని నరికేస్తూ.. మరోవైపు పాముని రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నట్టు చూపించారు. ఇక టీజర్ గమనిస్తే.. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అని తెలుస్తుంది.
The son of Gold rises🔥⚔️
Unveiling the spine-chilling #ThangalaanTeaser✨
▶️https://t.co/wwv4jcrvfN#Thangalaan #ThangalaanFromJan26@Thangalaan @chiyaan @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_ @PasupathyMasi @DanCaltagirone @thehari___… pic.twitter.com/tGlsOmCo1K— pa.ranjith (@beemji) November 1, 2023
ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. ‘సర్పట్ట పరంపర’ ఫేమ్ పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
తంగలాన్ నుంచి ఇప్పటికే మాళవికా మోహనన్ లుక్ విడుదల చేయగా.. డీగ్లామరైజ్డ్గా కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా గ్లామరస్ పాత్రలకే పరిమితమైన ఈ భామ తంగలాన్లో ఇదివరకెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నట్టు స్టన్నింగ్ లుక్తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ పా రంజిత్.