Thangalaan Movie | తమిళ స్టార్ నటుడు విక్రమ్, పా. రంజిత్ (Pa Ranjith) కాంబోలో వచ్చిన చిత్రం తంగలాన్ (Thangalaan). కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం గత ఏడాది ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. చాలా రోజుల తర్వాత విక్రమ్ హిట్ దక్కడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనతను సాధించింది.
తంగలాన్ చిత్రం తాజాగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కాబోతుంది. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న రాటర్డామ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో(International Film Festival Rotterdam) ఈ సినిమా డైరెక్టర్ కట్ ప్రదర్శితం కాబోతున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఎక్స్ వేదికగా ప్రకటించాడు.
Proud to announce the World Premiere of “Thangalaan” Director’s Cut—the uncensored vision of the film—today at IFFR 2025! Catch it at Pathé 5 as part of the 54th International Film Festival Rotterdam at 11:00 AM CET. Honored to present this raw and uncompromised storytelling to… pic.twitter.com/pTUVOijVYq
— pa.ranjith (@beemji) February 1, 2025