Thammudu | టాలీవుడ్ హీరో నితిన్‌కి ఈ మధ్య సక్సెస్ అనేదే లేదు. చివరిగా రాబిన్ హుడ్ చిత్రంతో పలకరించగా, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా టైటిల్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకులలో మంచి బజ్ ఉంది. దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘తమ్ముడు’ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్, యాక్షన్ అంశాలతో అంచనాలు పెంచేలా ఉంది.ట్రైలర్లో ‘మీ అక్కను చూశావా?. తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ, క్యారక్టర్ ను మాత్రం లూజ్ అవ్వలేదు’ అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అయింది. ”చేసిన తప్పు వల్ల ఆవిడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది అంటూ నితిన్ చెప్పిన డైలాగ్‌ని బట్టి చూస్తుంటే, తన అక్క మాటని నిలబెట్టే తమ్ముడి కథ ఇదని తెలుస్తోంది. నితిన్ అక్క పాత్రలో లయ కనిపించారు. ఇక ఈ సినిమాలో నితిన్ మరోసారి పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ, సౌరబ్ సచ్దేవ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.