Akhanda 2 Teaser | నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’. గతంలో రికార్డులు సృష్టించిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
‘అఖండ’ సృష్టించిన సునామీ తర్వాత, దాని సీక్వెల్ ‘అఖండ 2’ (అఖండ 2 – తాండవం) పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను విజయవంతంగా చిత్రీకరించింది. అంతేకాకుండా, ఇటీవలే జార్జియాలో కూడా షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే నటసింహం రేపు తన పుట్టినరోజును జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి అప్డేట్ను పంచుకున్నాడు సంగీత దర్శకుడు థమన్. నేడు సాయంత్రం 6:03 గంటలకు ‘సింహం శివుడి రూపంలో’ రాబోతుందంటూ అఖండ టీజర్ అప్డేట్ను పంచుకున్నాడు.
సింహం శివుడి రూపంలో 🔥
Massss hysteria !! From 6:03 PM #Akhanda2Teaser 💥💣🧨
— thaman S (@MusicThaman) June 9, 2025