Thaman |సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకి మంచి మ్యూజిక్ అందించి అందరిచే ప్రశంసలు అందుకున్నాడు. రీసెంట్గా విడుదలైన ఓజీ చిత్రానికి కూడా తమన్ అదిరిపోయే సంగీతం అందించాడు. ఈ సంవత్సరం అత్యధిక ఓపెనింగ్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాల మధ్య వెలుగులోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజే రూ.154 కోట్ల గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించి, టాలీవుడ్ లో మరో మైలురాయిగా నిలిచింది.
ఇక ఈ విజయానికి కారణాల్లో ఒకటిగా సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ అందించిన మ్యూజిక్ అని చెప్పాలి. ఆయన అందించిన బీజీఎం, ఎలక్ట్రిఫయింగ్ థీమ్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని విమర్శకులు చెబుతున్నారు. తమన్ అందించిన సంగీతం ప్రతీ చిత్రానికి ఒక ప్రత్యేకతను తెచ్చిపెడుతోంది. తాజాగా ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్, ఓజీ విజయాన్ని ఆనందంగా పంచుకుంటూనే, ఇటీవల జరిగిన ఓ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ సినిమాలో మ్యూజిక్ విషయంలో చాలా బాధపడ్డాను. ఆ సినిమాకు మహేష్ బాబు ఫ్యాన్స్ నాపై తీవ్రమైన ట్రోలింగ్ చేశారు. నేను ప్రతీ సినిమాకి సమానంగా కష్టపడతాను. ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువగా చూసే మనసు నాకు లేదు.
కానీ సినిమా కథలో, ప్రెజంటేషన్ లో పవర్ లేకపోతే, నా సంగీతం ఎంత బాగా ఉన్నా కూడా అది పట్టించుకోరు. అయినా ఫ్యాన్స్ నన్నే టార్గెట్ చేశారు. అప్పుడు నిజంగానే నాకు చాలా బాధేసింది. ఎన్నో సార్లు డార్క్ రూమ్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాను” అంటూ భావోద్వేగంతో మాట్లాడారు తమన్. ఈ సంగీత దర్శకుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనేకమంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన తమన్, ‘ఓజీ’తో మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నారు. బీజీఎమ్‌తో పాటు, సాంగ్స్ కూడా సినిమా ఫీల్‌ను పెంచాయి. సినిమాకు మూడ్ సెట్ చేయడంలో ఆయన మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని ఫిల్మ్ అనలిస్టులు పేర్కొన్నారు.