కాఫీ ట్యూన్స్ ఇస్తే ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ అన్నం పెడుతుందా.. ఈ డైలాగ్ చాలా ఫేమస్ సోషల్ మీడియాలో మీమర్స్ ఈ డైలాగ్ తో ఆడుకున్నారు. ఈ మాట ఎవరు వాడారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రెండేళ్ల కింద మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక ఇంటర్వ్యూలో అన్నమాట ఇది దీన్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వాడుకున్నారు. ప్రతి దానికి తమన్ చెప్పిన మాటతో మీమ్స్ చేశారు. ఈయనపై ఇష్టమొచ్చినట్టు ట్రోలింగ్ కూడా చేశారు.
తనపై.. తను చెప్పిన మాటపై ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా తమన్ మాత్రం ఎప్పుడూ పెద్దగా దీనిపై స్పందించలేదు.. మీడియా ముందు రియాక్ట్ కాలేదు.తన పని తాను చేసుకుంటూ బిజీ అయిపోయాడు. పైగా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈయన నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం తమన్ చేతిలో 10 సినిమాలకు పైగా ఉన్నాయి.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు కూడా సంగీతం మందిస్తున్నాడు ఈయన. ఇలాంటి సమయంలో ఈయనపై కాపీ క్యాట్ అనే ముద్ర పడుతుంది. ఇప్పటికీ తమన్ పాటలను ఇష్టమ్ మొచ్చినట్టు ట్రోలింగ్ చేస్తుంటారు. అయినా కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. తాను ఒక పాటను ట్యూన్ చేసిన తర్వాత దానిని ఓకే చేయడానికి చాలా మంద ఉంటారని.. ఎంతోమంది వింటారని వాళ్ళందరూ ఒకే అన్న తర్వాత తన పాట సినిమాలో ఉంటుందనే విషయాన్ని ట్రోలింగ్ చేసే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పాడు తమన్.
ఇక ఇప్పుడు ఈ విషయంపై మరోసారి స్పందించాడు ఈయన. నేను సాంగ్స్ కాపీ కొడితే మా అమ్మ నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం పెట్టదు అనే మాటపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. మీమ్స్ చేసే వాళ్లకు వాళ్ళ ఇంట్లో ముందు వాళ్ళ అమ్మ అన్నం పెడుతుందో లేదో అంటూ మరో కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం తమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.